ఈ పాట వింటున్నంత సేపు వాన లో తడిసి ముద్దవటం ఖాయం.....కమలాకర్ సంగీతానికి కార్తిక్ గానం తోడయ్యి m .s .రాజు తెరకెక్కించిన ప్రకృతి అందాలలో ఈ పాట కి ఒక జీవం వచ్చింది...ఈ పాట నచని వాళ్లు చాల అరుదుగా ఉంటారు అనటం లో సందేహం లేదు......
ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో …
మైమరచిపోయా మాయలో …
ప్రాణమంత మీటుతుంటే వాన వీణలా … ||ప|| ఎదుట నిలిచింది చూడు …||
చరణం1: నిజంలాంటి ఈ స్వప్నం .. ఎలాపట్టి ఆపాలి …
కలే అయితే ఆ నిజం ఎలా తట్టుకోవాలీ …
అవునో కాదో అడగకంది నా మౌనం …
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం …
చెలిమి బంధమల్లుకుందే .. జన్మ ఖైదులా …||ప||ఎదుట నిలిచింది చూడు …||
చరణం 2: నిన్నే చేరుకోలేక ఎటేళ్లిందో.. నా లేఖ …
వినేవారు లేకా .. విసుక్కుంది నా కేక …
నీదో కాదో రాసున్న చిరునామా
వుందో లేదో ఆ చోట నా ప్రేమా
వరంలాంటి శాపమేదో సొంతమైందిలా
ఎదుట నిలిచింది చూడు … ||ప||
No comments:
Post a Comment