Thursday, 10 February 2011

starts wid an unknown superb song...

                     మనం పాటల్ని వింటూ ఉంటాం కాని ఆ పాటల సాహిత్యం కోసం ఒక్కోసారి అన్వేషించి దొరక్క పాట పడుకోవటం లో ఇబ్బంది పడుతుంటాం కదా...నేను ఈ బ్లాగు మొదలుపెట్టడానికి అదే కారణం.నా మొదటి పాట ఒక ఆవేదనా గీతం తో మొదలు పెడతాను......ఈ పాట శివ 2006 చిత్రం లోనిది...దర్శకత్వం:రామ్ గోపాల్ వర్మ,సంగీతం:ఇళయరాజా,గీత కర్త: సిరివెన్నల సీతారామశాస్త్రి.
       గమనిక:తప్పులు ఉన్న యెడల పెద్ద మనసు తో సర్దుకుని ముందుకు పోగలరని ఆశిస్తూ ........మీ రాము..


     
పల్లవి:        ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా......?(2)
                 ఈ నిజం కోసమా ..ఈ నిజం కోసమా కలలు కన్నావు నా దేశమా......
                 రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..
                 ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా....


చరణం 1:   
                 ఎన్నాళ్ళైనా చలనమె లేని రాతిరధం పై ప్రయాణమా...
                 కావాలన్నా కాంతే రాని కారడెవే నీకు గమ్యమా......?
                 అర్ధరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా.... ?
                 నిద్ర చెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా....?
                 రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా.......

                 ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా.......?

చరణం 2 : 
                కాసే కంచే మేస్తూ ఉంటె చేనుకి ఏదింక రక్షణ.....?
                వేకువతోనే  చీకటి పడితే  పయనం అడుగైన సాగునా..... ?
                బానిసత్వ భావనా  మనసులోనే మిగిలినా  
                శాంతి జాడ దొరుకునా యెంత సెపి వెతికినా .....?              


              రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..
              ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా....
              ఈ నిజం కోసమా ..ఈ నిజం కోసమా కలలు కన్నావు నా దేశమా......
              రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..........



             శివ 2006 పాటలు అద్బుతంగా ఇచ్చారు ఇళయరాజా....ఒకసారి  మీకు కుదిరితే వినండి..........ధన్యవాదాలు...
 


    


   

2 comments:

  1. ఈ సినిమాలో "అడగనిదే చెప్పేది ఎలా, మనసా అడగవా" పాటలు చాలా నచ్చుతాయి నాకు. :)

    ReplyDelete
  2. naku chala chala istam aa songs anni...moodu songs vuntai.....superb...adaganidey cheppedi yela,manasa adagava,ye oohalono telanemo...ee mudu chala baguntai.....

    ReplyDelete