Wednesday, 23 February 2011

shiva 2006

  మొదటి పోస్ట్ లో  చెప్పాను కదా ...శివ 2006  పాటలు చాల బాగుంటాయి  అని .అందుల్లో నాకు ఇంకా చాలా మందికీ నచ్చే ఇంకొక పాట "ఏ ఊహలోనో తేలానేమో"......
              ఈ చిత్రానికి :
           సంగీతం:''మేస్ట్రో'' ఇళయరాజా  ,సాహిత్యం:"సిరివెన్నెల" సీతారామశాస్త్రి ,పాడినవారు :సునీత,విజయప్రకాష్.

పల్లవి:  

               న న నా .....న న న న నా ....నా  నా న న నా నా ...న న న త న న న న న నా నా ......
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......

చరణం 1 :

              ఏవో ఊహల్లో ఎన్నాళ్లని తిరగాలీ...?
              ఎదరే నువ్వున్నా కలలెందుకు చూడాలీ...?
              నాలాగా నీలోనూ ఈ ప్రశ్నలు చూశాను.....
              కొంటె సైగల చాటుగా  కంచె దాటని కోరికా ముందడుగేయదు  ఎందుకు అంటే ఏమనను ?
               
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......
 
చరణం 2 :
                             
               నీతో నేనేదో అందామనుకుంటున్నా....
               వేరే ఇంకేదో అంటూ గడిపేస్తున్నా .......
               ఏ మంత్రం వేస్తావో ....  మైకం లో తోస్తావో....
               నిన్నిలా చూస్తుండగా మాటలేవీ తోచక .....
               గుండెలలో గల సంగతిలో పైకనగలనా....

               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......

                              ఇంకొక పోస్ట్ లో ఇదే చిత్రం లో మరొక మంచి పాట పెడతాను.........ఈ బ్లాగ్ చూసిన వారు మీ సూచనలు ఇస్తారని ఆశిస్తూ .......
                ధన్యవాదాలు....

No comments:

Post a Comment