మళ్లీ వాన లో తడుద్దామని ఈ పాట పోస్ట్ చేస్తున్నా....... నిజానికి ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరదు....కార్తీక్ కి కమలాకర్ కి ఎన్నో ధన్యవాదాలు......
ఆకాశగంగా …
జల జల జడిగా .. తొలి అలజడిగా …
తడబడు అడుగా .. నిలబడు సరిగా …
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా …
ఆకాశగంగా … దూకావే పెంకితనంగా …
ఆకాశగంగా … ||ఆకాశగంగా … ||
చరణం 1: కనుబొమ్మ విల్లెత్తి I.. ఓ నవ్వు విసిరావే …
చిలకమ్మ గొంతెత్తి తీయంగా కసిరావే ||2||
చిటపటలాడి .. వెలసిన వాన …
మెరుపులా దాడి .. కనుమరుగైనా …
నా గుండెలయలో .. విన్నా నీ అలికిడి …
ఆకాశగంగా …దూకావే పెంకితనంగా …
ఆకాశగంగా …|| ఆకాశగంగా … ||
చరణం 2: ఈ పూట వినకున్నా .. నా పాట ఆగేనా …
ఏ బాట లోనైనా .. నీ పైటనోదిలేనా … ||2||
మనసుని నీతో .. పంపిస్తున్నా …
నీ ప్రతి మలుపు తెలుపవే అన్నా …
ఆ జాడలన్నీ వెతికి .. నిన్ను చేరనా …
ఆకాశగంగా …దూకావే పెంకితనంగా …
ఆకాశగంగా …
జల జల జడిగా .. తొలి అలజడిగా …
తడబడు అడుగా .. నిలబడు సరిగా …
నా తలపు ముడివేస్తున్నా నిన్నాపగా …|| ఆకాశగంగా … ||
No comments:
Post a Comment