Monday, 20 June 2011

nenu nenuga leney....




                                     దేవి శ్రీ ప్రసాద్  సినిమాల్లో అద్భుతమైన సంగీతం ఇచ్చిన సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి.......అందుల్లో అందరికి నచిన ఒక పాట......
                  చిత్రం: మన్మధుడు,  దర్శకుడు:విజయ భాస్కర్,  సంగీతం:దేవి శ్రీ ప్రసాద్, సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
 
 
పల్లవి:       నేను  నేనుగా  లేనే  నిన్న  మొన్నలా
                లేనిపోని   ఊహల్లో  ఏమిటో  ఇలా
                ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
                ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా ....||  నేను నేనుగా 2 ||


చరణం 1: పూలచెట్టు  ఊగినట్టు  పాలబొట్టు  చిందినట్టు
               అల్లుకుంది  నా  చుట్టూ  ఓ  చిరునవ్వు
               తేనెపట్టు  రేగినట్టు  వీణమెట్టు వులికినట్టు
               ఝల్లుమంది  గుండెల్లో  ఎవరే  నువ్వు
               నా  మనసుని  మైమరపున  ముంచిన  ఆ  వాన
               మీకేవరికి  కనిపించదు  ఏమైనా  ఓఓ ..హో ..హూ ...|| నేను నేనుగా ||

చరణం 2:  చుట్టు పక్కలెందరున్నా   గుర్తు  పట్టలేక  వున్నా
               అంత  మంది  ఒకలాగే  కనపడుతుంటే
               తప్పు  నాది  కాదు  అన్న  ఒప్పుకోరు  ఒక్కరైనా
               చెప్పలేను  నిజమేదో  నాకూ  వింతే
               కళ్ళను  వదిలేల్లను  అని  కమ్మిన  మెరుపేదో
               చెప్పవా కను  రెప్పలకే  మాటొస్తే  ఓఓ ...హో ...హూ ...! || నేను నేనుగా  ||

No comments:

Post a Comment