Monday, 20 June 2011

nenu nenuga leney....




                                     దేవి శ్రీ ప్రసాద్  సినిమాల్లో అద్భుతమైన సంగీతం ఇచ్చిన సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి.......అందుల్లో అందరికి నచిన ఒక పాట......
                  చిత్రం: మన్మధుడు,  దర్శకుడు:విజయ భాస్కర్,  సంగీతం:దేవి శ్రీ ప్రసాద్, సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
 
 
పల్లవి:       నేను  నేనుగా  లేనే  నిన్న  మొన్నలా
                లేనిపోని   ఊహల్లో  ఏమిటో  ఇలా
                ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
                ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా ....||  నేను నేనుగా 2 ||


చరణం 1: పూలచెట్టు  ఊగినట్టు  పాలబొట్టు  చిందినట్టు
               అల్లుకుంది  నా  చుట్టూ  ఓ  చిరునవ్వు
               తేనెపట్టు  రేగినట్టు  వీణమెట్టు వులికినట్టు
               ఝల్లుమంది  గుండెల్లో  ఎవరే  నువ్వు
               నా  మనసుని  మైమరపున  ముంచిన  ఆ  వాన
               మీకేవరికి  కనిపించదు  ఏమైనా  ఓఓ ..హో ..హూ ...|| నేను నేనుగా ||

చరణం 2:  చుట్టు పక్కలెందరున్నా   గుర్తు  పట్టలేక  వున్నా
               అంత  మంది  ఒకలాగే  కనపడుతుంటే
               తప్పు  నాది  కాదు  అన్న  ఒప్పుకోరు  ఒక్కరైనా
               చెప్పలేను  నిజమేదో  నాకూ  వింతే
               కళ్ళను  వదిలేల్లను  అని  కమ్మిన  మెరుపేదో
               చెప్పవా కను  రెప్పలకే  మాటొస్తే  ఓఓ ...హో ...హూ ...! || నేను నేనుగా  ||

Sunday, 19 June 2011

malli....aakasha ganga....

                       మళ్లీ  వాన లో తడుద్దామని ఈ పాట పోస్ట్ చేస్తున్నా....... నిజానికి ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరదు....కార్తీక్ కి కమలాకర్ కి ఎన్నో ధన్యవాదాలు......


పల్లవి:     ఆకాశగంగా…దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …
              జల జల  జడిగా .. తొలి  అలజడిగా …
              తడబడు  అడుగా .. నిలబడు  సరిగా …
              నా తలపు  ముడివేస్తున్నా  నిన్నాపగా …
              ఆకాశగంగా … దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …  ||ఆకాశగంగా … ||
చరణం 1: కనుబొమ్మ  విల్లెత్తి I.. ఓ  నవ్వు  విసిరావే …
              చిలకమ్మ  గొంతెత్తి  తీయంగా  కసిరావే    ||2||
              చిటపటలాడి .. వెలసిన  వాన …
              మెరుపులా  దాడి .. కనుమరుగైనా …
              నా  గుండెలయలో .. విన్నా  నీ  అలికిడి …
              ఆకాశగంగా …దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …|| ఆకాశగంగా … ||
చరణం 2: ఈ  పూట  వినకున్నా .. నా  పాట  ఆగేనా …
              ఏ బాట  లోనైనా .. నీ  పైటనోదిలేనా … ||2||
              మనసుని  నీతో .. పంపిస్తున్నా …
              నీ  ప్రతి మలుపు  తెలుపవే  అన్నా …
              ఆ  జాడలన్నీ వెతికి .. నిన్ను  చేరనా  …
              ఆకాశగంగా …దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …
              జల  జల  జడిగా .. తొలి  అలజడిగా …
              తడబడు  అడుగా .. నిలబడు  సరిగా …
              నా  తలపు  ముడివేస్తున్నా  నిన్నాపగా …|| ఆకాశగంగా … ||

Monday, 6 June 2011

VAANA..

          ఈ పాట వింటున్నంత సేపు వాన లో తడిసి ముద్దవటం ఖాయం.....కమలాకర్ సంగీతానికి కార్తిక్ గానం తోడయ్యి  m .s .రాజు తెరకెక్కించిన ప్రకృతి అందాలలో ఈ పాట కి ఒక జీవం వచ్చింది...ఈ పాట నచని వాళ్లు చాల అరుదుగా ఉంటారు అనటం లో సందేహం లేదు......



పల్లవి:     ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో …
              ఎదను తడిపింది  నేడు చినుకంటి చిన్నదేమో …
              మైమరచిపోయా మాయలో …
              ప్రాణమంత మీటుతుంటే వాన  వీణలా … ||ప|| ఎదుట  నిలిచింది  చూడు …||

చరణం1:    నిజంలాంటి  ఈ  స్వప్నం .. ఎలాపట్టి  ఆపాలి …
                 కలే  అయితే  ఆ  నిజం  ఎలా  తట్టుకోవాలీ …
                 అవునో  కాదో  అడగకంది నా  మౌనం …
                 చెలివో  శిలవో  తెలియకుంది   నీ  రూపం …
                 చెలిమి  బంధమల్లుకుందే .. జన్మ  ఖైదులా …||ప||ఎదుట  నిలిచింది  చూడు …||

చరణం 2:    నిన్నే  చేరుకోలేక  ఎటేళ్లిందో..   నా  లేఖ …
                  వినేవారు  లేకా .. విసుక్కుంది  నా  కేక …             
                  నీదో  కాదో  రాసున్న  చిరునామా
                  వుందో  లేదో  ఆ  చోట  నా  ప్రేమా
                  వరంలాంటి  శాపమేదో  సొంతమైందిలా
                  ఎదుట  నిలిచింది  చూడు … ||ప||

Monday, 21 March 2011

criminal...

   క్రిమినల్ చిత్రంలో అద్భుతమైన పాట ....తెలుసా మనసా ...ఎన్ని తరాలైన అందరికీ నచ్చే పాట ఇది.

    చిత్రం:క్రిమినల్ , సాహిత్యం:సిరివెన్నెల ,సంగీతం:యం.యం.కీరవాణి. గానం:ఎస్.పి.బాలు,చిత్ర. 


 పల్లవి:      తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
                తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
                విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
                శతజన్మాల బంధాల బంగారు క్షణమిది          
          
                తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

చరణం 1: 
                  ప్రతి  క్షణం   నా  కళ్ళల్లో నిలిచే  నీ  రూపం
                  బ్రతుకులో  అడుగడుగునా నడిపే   నీ  స్నేహం
                  ఉపిరే  నీవుగా ప్రాణమే  నీదిగా
                  పది  కాలాలు  వుంటాను నీ  ప్రేమ  సాక్షిగా

                  తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 


                  darling every breath you take
                  every move you make
                  i will be there
                  what would i do without you
                  i want to love you
                  forever and ever and ever

చరణం 2 :   యెన్నడూ  తీరిపోని ఋణముగా  వుండిపో
                  చెలిమితో  తీగసాగే మల్లెగా  అల్లుకో
                  లోకమే  మారినా కాలమే  ఆగినా
                  మన  ఈ గాధ  మిగలాలి  తుదిలేని  చరితగా
         
                 తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
                 తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
                 విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
                 శతజన్మాల బంధాల బంగారు క్షణమిది         

                 తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.....


                     ఈ పాటలో   సాహిత్యం  యెంత బాగుంటుందో  పాట తీసిన విధానం కూడా అంతే అందంగా ఉంటుంది....ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చిన సిరివెన్నెల గారికి దానికి ఇంకా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన కీరవాణి గారికి  హేట్సాఫ్...........

Wednesday, 23 February 2011

shiva 2006

  మొదటి పోస్ట్ లో  చెప్పాను కదా ...శివ 2006  పాటలు చాల బాగుంటాయి  అని .అందుల్లో నాకు ఇంకా చాలా మందికీ నచ్చే ఇంకొక పాట "ఏ ఊహలోనో తేలానేమో"......
              ఈ చిత్రానికి :
           సంగీతం:''మేస్ట్రో'' ఇళయరాజా  ,సాహిత్యం:"సిరివెన్నెల" సీతారామశాస్త్రి ,పాడినవారు :సునీత,విజయప్రకాష్.


పల్లవి:  

               న న నా .....న న న న నా ....నా  నా న న నా నా ...న న న త న న న న న నా నా ......
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......

చరణం 1 :

              ఏవో ఊహల్లో ఎన్నాళ్లని తిరగాలీ...?
              ఎదరే నువ్వున్నా కలలెందుకు చూడాలీ...?
              నాలాగా నీలోనూ ఈ ప్రశ్నలు చూశాను.....
              కొంటె సైగల చాటుగా  కంచె దాటని కోరికా ముందడుగేయదు  ఎందుకు అంటే ఏమనను ?
               
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......
 
చరణం 2 :
                             
               నీతో నేనేదో అందామనుకుంటున్నా....
               వేరే ఇంకేదో అంటూ గడిపేస్తున్నా .......
               ఏ మంత్రం వేస్తావో ....  మైకం లో తోస్తావో....
               నిన్నిలా చూస్తుండగా మాటలేవీ తోచక .....
               గుండెలలో గల సంగతిలో పైకనగలనా....

               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అడగనిదే చెప్పేది ఎలా...చెప్పనిదే తెలిసేది ఎలా.....
               అవును అనో నువ్వు కాదు అనో తెలపాలి కదా...
               ఐ లవ్ యూ ........ఐ లవ్ యూ......

    
                              ఇంకొక పోస్ట్ లో ఇదే చిత్రం లో మరొక మంచి పాట పెడతాను.........ఈ బ్లాగ్ చూసిన వారు మీ సూచనలు ఇస్తారని ఆశిస్తూ .......
                ధన్యవాదాలు....

 

Tuesday, 15 February 2011

      రెహమాన్ కూర్చిన ముత్యాల స్వరాలలో ఈ పాట కూడా ఒకటి..అద్భుతమైన పాట...
    చిత్రం:నువ్వు నేను ప్రేమ ,, సంగీతం:రెహమాన్ ,   సాహిత్యం:స్వర్గీయ వేటూరి సుందర రామమూర్తి , పాడినవారు: నరేష్ అయ్యర్,శ్రేయా ఘోషల్




  ప్రేమించే  ప్రేమవా ... ఊరించే   ఊహవా ...
  ప్రేమించే  ప్రేమవా ... పువ్వల్లె  పుష్పించే 
  నే ... నేనా .. అడిగా  నన్ను  నేనే
  నే ... నీవే  హృదయం  అన్నదే ..

  ప్రేమించే  నా  ప్రేమవా ... ఊరించే  ఊహవా ..
  ప్రేమించే  ప్రేమవా .. పువ్వల్లె  పుష్పించే

   రంగు ... రంగోలి ...గోరింటే నువ్వు  పెట్టే
   రంగే పెట్టిన  రేఖలు  విరిసి  గాజుల  సవ్వడి  ఘల్ ఘల్ ...

   రంగు ... రంగోలి ...గోరింటే  నువ్వు  పెట్టే
   రంగే  పెట్టిన  రేకలు  విరిసి  సుందరి  కన్నులు    చందనమద్దిన చల్లని  పున్నమి  వెన్నెల కన్నులు ...

   పువ్వైనా పూస్తున్నా... నీ  పరువంగానే  పుడతా
   మధుమాసపు  మాలల  మంటలు  రగిలించే   వుసురై ..

   నీవే  నా  మదిలో  ఆడ .. నేనే  నీ  నటనై రాగా
   నా  నాడుల్ల నీ  రక్తం  నడకల్లో  నీ  శబ్దం  ఉందేమో ...

   తోడే  దొరకని  నాడు  విల  విల  లాడే  వొంటరి  వీనం
  
ప్రేమించే  ప్రేమవా ... ఊరించే   ఊహవా ...
   ప్రేమించే  ప్రేమవా ... పువ్వల్లె  పుష్పించే 
   నే ... నేనా .. అడిగా  నన్ను  నేనే 
   నే ... నీవే  హృదయం  అన్నదే ..



   ప్రేమించే  ప్రేమవా ... ఊరించే   ఊహవా ...
   ప్రేమించే  ప్రేమవా ... పువ్వల్లె  పుష్పించే 

   నెల నెల వాడుక  అడిగి  నెలవంకల  గుడి  కడదామా
   నా   పొదరింటికి  వేరే  అతిధులు  రా  తరమా

   తుమ్మెద  తేనెలు  తేలే  నీ   మదిలో  చోటిస్తావా .
   నే   ఒదిగే  ఎదపై  ఎవరో  నిదురించ  తరమా ....

    నీవే   సంద్రము  చేరే  గల  గల  పారే  నది  తెలుసా .....

   
ప్రేమించే  ప్రేమవా ... ఊరించే   ఊహవా ...
    ప్రేమించే  ప్రేమవా ... పువ్వల్లె  పుష్పించే 
    నే ... నేనా .. అడిగా  నన్ను  నేనే
    నే ... నీవే  హృదయం  అన్నదే ..

    ప్రేమించే .........ప్రేమించే  ప్రేమవా ... ఊరించే   ఊహవా ...
    ప్రేమించే  ప్రేమవా ... పువ్వల్లె  పువ్వల్లే..............



    రంగు ...రంగోలి ..గోరింటే నువ్వు పెట్టే ---(5 )                                                                                                                                                       
    రంగే  పెట్టిన  రేకలు  విరిసి  సుందరి  కన్నులు    చందనమద్దిన చల్లని  పున్నమి  వెన్నెల కన్నులు ...--(5 )




Thursday, 10 February 2011

gagananiki udayam......

                          ఈరోజు  బ్లాగులో నేను పెట్టబోయే పాట తొలిప్రేమ లోనిది.గగనానికి ఉదయం ఒకటే అని మొదలయ్యే ఈ విరహగీతం ఎంతో మంది మది దోచుకుంది.
                    దర్శకత్వం:కరుణాకరన్,  సంగీతం:దేవా, సాహిత్యం:సిరివెన్నెల,భువన చంద్ర.(మొత్తం చిత్రానికి)

పల్లవి:    
               గగనానికి ఉదయం ఒకటే 
               కెరటాలకి సంద్రం ఒకటే
               జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
               ప్రణయానికి నిలయం మనమై
               యుగయుగముల ప్రణయం మనమై
               ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
               జన్మించలేదా నీవు నాకోసమే...
               గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
               ప్రేమా...................... ప్రేమా ......................         


చరణం 1 :
               నీ కన్నుల్లో కలలు అడుగు ఇతడు ఎవరనీ...
               నీ గుండెల్లో పెరిగే లయనే బదులు అడగని...  
               నిదురించు యవ్వనం లో పొద్దుపొడుపై
               కదిలించ లేదా నేనే మేలుకొలుపై.....
               గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువా..... 
               పరదాల మంచుపొరలో నేను చేరా..
            
               గగనానికి..........................ఒకటే....

చరణం 2 :  
               నా ఊహల్లో కదిలే కలలే ఎదుట పడినవి....
               నా  ఊపిరిలో ఎగసే సెగలే కుదుటపడినవి....
               సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ...
               మమతన్న అమృతంలో మునిగిపోనీ.....
               మనవైన ఈ క్షణాలే అక్షరాలై .....
               తుది లేని ప్రేమకధలా మిగిలిపోనీ.......
  
               గగనానికి ఉదయం ఒకటే 
               కెరటాలకి సంద్రం ఒకటే
               జగమంతట ప్రణయం ఒకటే ...ఒకటే....
               ప్రణయానికి నిలయం మనమై
               యుగయుగముల ప్రణయం మనమై
               ప్రతిజన్మలో కలిశాం మనమే.....మనమే...
               జన్మించలేదా నీవు నాకోసమే...
               గుర్తించలేదా నన్ను నా ప్రాణమే.......
               ప్రేమా...................... ప్రేమా ....................( 6 )


               


                  

starts wid an unknown superb song...

                     మనం పాటల్ని వింటూ ఉంటాం కాని ఆ పాటల సాహిత్యం కోసం ఒక్కోసారి అన్వేషించి దొరక్క పాట పడుకోవటం లో ఇబ్బంది పడుతుంటాం కదా...నేను ఈ బ్లాగు మొదలుపెట్టడానికి అదే కారణం.నా మొదటి పాట ఒక ఆవేదనా గీతం తో మొదలు పెడతాను......ఈ పాట శివ 2006 చిత్రం లోనిది...దర్శకత్వం:రామ్ గోపాల్ వర్మ,సంగీతం:ఇళయరాజా,గీత కర్త: సిరివెన్నల సీతారామశాస్త్రి.
       గమనిక:తప్పులు ఉన్న యెడల పెద్ద మనసు తో సర్దుకుని ముందుకు పోగలరని ఆశిస్తూ ........మీ రాము..


     
పల్లవి:        ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా......?(2)
                 ఈ నిజం కోసమా ..ఈ నిజం కోసమా కలలు కన్నావు నా దేశమా......
                 రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..
                 ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా....


చరణం 1:   
                 ఎన్నాళ్ళైనా చలనమె లేని రాతిరధం పై ప్రయాణమా...
                 కావాలన్నా కాంతే రాని కారడెవే నీకు గమ్యమా......?
                 అర్ధరాత్రి వేళలో అలికిడే స్వతంత్రమా.... ?
                 నిద్ర చెడిన కళ్ళలో ఎర్రదనమే ఉదయమా....?
                 రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా.......

                 ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా.......?

చరణం 2 : 
                కాసే కంచే మేస్తూ ఉంటె చేనుకి ఏదింక రక్షణ.....?
                వేకువతోనే  చీకటి పడితే  పయనం అడుగైన సాగునా..... ?
                బానిసత్వ భావనా  మనసులోనే మిగిలినా  
                శాంతి జాడ దొరుకునా యెంత సెపి వెతికినా .....?              


              రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..
              ఎన్నో త్యాగాల దాస్యమా ఏం సాధించింది నీ శ్రమా....
              ఈ నిజం కోసమా ..ఈ నిజం కోసమా కలలు కన్నావు నా దేశమా......
              రాలిన స్వప్నాల సాక్షిగా పాపమే పాలించె స్వేచ్ఛగా..........



             శివ 2006 పాటలు అద్బుతంగా ఇచ్చారు ఇళయరాజా....ఒకసారి  మీకు కుదిరితే వినండి..........ధన్యవాదాలు...