Saturday, 21 April 2012

Andagaada (Gharshana)

  పాట: అందగాడా అందగాడా...  గీతరచయిత:కులశేఖర్   మూవీ:ఘర్షణ   గానం:హరిణి   సంగీతం:హారిస్ జయరాజ్



పల్లవి:      అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
               అల్లుకోరా గిల్లుకోరా అందమంతా  నీదిరా
               మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటుందోయ్ అందగాడా
               పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
               గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
               ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా.........  
                                                                         ||అందగాడా అందగాడా||



చరణం 1:  గాలే తాకని నాలో సోకునీ ఇన్నాళ్ళున్చానయ్యో  నీకోసం
                నా అందం చందం అంతా నీకోసం
                తోడే లేదని వాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
                నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
                ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం....
                                                                           ||అందగాడా అందగాడా||

చరణం 2:   జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీ రూపం
                 ఏనాడూ లేనే లేదు ఈ మైకం
                 నాలో శ్వాసకీ రేగే  ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం
                 గుర్తంటూ రానేరాదు ఈ లోకం
                 నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
                 రాగమై సాగనీ అంతులేని ఆనందం....


               మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటుందోయ్ అందగాడా
               పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా 
               గోదారల్లే నాలో  పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
               ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా..........



No comments:

Post a Comment