Monday, 23 April 2012

magaallu vatti maayagaalley....(Golimaar)

మూవీ: గోలీమార్
గీతరచయిత:భాస్కరభట్ల
గానం:గీతామాధురి
సంగీతం:చక్రి  


పల్లవి:      మగాళ్ళు వొట్టి మాయగాళ్ళే...
               ప్రేమంటే ఏమిటో తెలీదే ...
              నట్టేట్లో ముంచేసి పోతారే...
              ఈడు కూడా ఇంతే ..  ||మగాళ్ళు వొట్టి||

              మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే ...
              మాలాగ లైఫ్ అంత వుండరంతే...
              మగాడి బుద్ధి కుక్కతోక లాంటిదంతే...
              ఈడు కూడా ఇంతే...||మగాళ్ళు వొట్టి||

చరణం 1: కాస్తంత ఓదార్పు కోరుకుంటాం ...
              కూసింత టైం ఇస్తే పొంగిపోతాం ...[2]
              మగాళ్ళ  గోలేంటో ఫీల్ ఏంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో ...
              మీకు నచినట్టు మేము మారినా ...
              మా గుండె కోసి మీకు ఇచ్చినా మీరింతే ఛి ఛీ...
              ఈడు కూడా ఇంతే... ||మగాళ్ళు వొట్టి||




చరణం 2: కోపంలో ఎమన్నా సర్దుకుంటాం...
               కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం ...[2]
               మగాళ్ళ మైండ్ ఏంటో మూడ్ ఏంటో...
               మాటేంటో  చూపేంటో ఏమో ఏంటో ...
               అడ్డమైన సేవలేన్ని చేసినా...
               ఆకాశమంత ప్రేమ పంచినా మీరింతే ఛి ఛీ ...
               ఈడు కూడా ఇంతే ||మగాళ్ళు వొట్టి||

No comments:

Post a Comment