Saturday, 21 April 2012

Andagaada (Gharshana)

  పాట: అందగాడా అందగాడా...  గీతరచయిత:కులశేఖర్   మూవీ:ఘర్షణ   గానం:హరిణి   సంగీతం:హారిస్ జయరాజ్



పల్లవి:      అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా
               అల్లుకోరా గిల్లుకోరా అందమంతా  నీదిరా
               మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటుందోయ్ అందగాడా
               పూలపక్క ఆకువక్క అందుకోరా సుందరా
               గోదారల్లే నాలో పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
               ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా.........  
                                                                         ||అందగాడా అందగాడా||



చరణం 1:  గాలే తాకని నాలో సోకునీ ఇన్నాళ్ళున్చానయ్యో  నీకోసం
                నా అందం చందం అంతా నీకోసం
                తోడే లేదని వాలే కౌగిలి ఎప్పటినుంచి ఉందో నీకోసం
                నా ప్రాయం ప్రాణం అంతా నీకోసం
                ఎందుకో ఏమిటో ఇంతకాలం ఎంతో దూరం ముందరే ఉందిగా సొంతమయ్యే సంతోషం....
                                                                           ||అందగాడా అందగాడా||

చరణం 2:   జారే పైటకీ తూలే మాటకీ తాపం పెంచిందయ్యో నీ రూపం
                 ఏనాడూ లేనే లేదు ఈ మైకం
                 నాలో శ్వాసకీ రేగే  ఆశకీ దాహం పెంచిందయ్యో నీ స్నేహం
                 గుర్తంటూ రానేరాదు ఈ లోకం
                 నీ జతే చేరితే మాయమయ్యే నాలో మౌనం
                 రాగమై సాగనీ అంతులేని ఆనందం....


               మల్లెమొగ్గా మల్లెమొగ్గా రమ్మంటుందోయ్ అందగాడా
               పూలపక్కా ఆకువక్కా అందుకోరా సుందరా 
               గోదారల్లే నాలో  పొంగే కోరికమ్మ నీదేలేరా నోరూరించే ఆడబొమ్మ
               ఆడుకోరా పాడుకోరా రాతిరంతా హాయిగా..........



Anaganaga kathala..(Venky)

ఈరోజు అప్ లోడ్ చెయ్యబోయే పాట "వెంకీ"లో మెలోడి  ""అనగనగా కథలా""
  సినిమా: వెంకీ      గీతరచయిత: సాహితి  సంగీతం: దేవి శ్రీ ప్రసాద్   గానం: కార్తీక్,సుమంగళి





పల్లవి:       అనగనగా కధలా ఆ నిన్నకి సెలవిస్తే 
                అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే
                లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా
                ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా
                ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా ||
అనగనగా ||
                హేల హేలాల జాబిలి కంట్లో కన్నీళ్ళా
                హేల హేలాల వెన్నెల కురవాలా


చరణం 1:   హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా 
                రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా 
                 అరె ఈ నేల ఆకాశం ఉందే మన కోసం 
                వందేళ్ళ సంతోషం అంతా మన సొంతం  
                ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా  అల్లరి చేద్దాం 
             ||అనగనగా||
 
చరణం 2:   ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నా యద నీ జతే కోరుతుందిగా
                 ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట ఉండవా ......
                 హే కలలే నిజమైనాయి కనులే ఒకటయ్యి 
                 కలిపేస్తూ నీచేయి  అడుగే  చిందెయ్యి
                 మన స్నేహాలు సావాసాలు కలకాలాలకు కథ కావాలి
          ||హేలహేలాల||

Friday, 2 March 2012

sontham(telusuna telusuna)

 చాలా రోజుల తర్వాత మరొక మంచి పాటతో వచ్చాను.సొంతం సినిమా నుంచి తెలుసునా తెలుసునా...
      సంగీతం:దేవి శ్రీ ప్రసాద్     గానం:చిత్ర  






పల్లవి:        తెలుసునా.. తెలుసునా... మనసుకే తొలి కదలిక   
                 అడగనా.. అడగనా... అతడినే మెలమెల్లగా 
                 నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేకా.....
                 నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేకా....
                 ఎలా.... ఎలా.... దాచి ఉంచేది ఎలా... ఎలా... దాన్ని ఆపేది    ||తెలుసునా...||

చరణం1:     అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
                 పెదవి చివరే పలకరింపు నిలిచిపోతోంది
                 కొత్త నేస్తం కాదుగా....  ఇంత ఖంగారెందుకో
                 ఇంత వరకూ లేదుగా.... ఇపుడు ఏమైందో
                 కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక                         ||తెలుసునా...||

చరణం౨:    గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది
                 తడిమి చూస్తే అతని తలపే నిండిపోయుంది
                 నిన్న దాకా ఎప్పుడూ... నన్ను తాకేటప్పుడు 
                 గుండెలో ఈ చప్పుడూ... నేను వినలేదే
                 అలగవే హృదయమా...అనుమతైనా అడగలేదని...              ||తెలుసునా...||



                కలవనా కలవనా నేస్తమా అలవాటుగా 
                పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా...........
 
 
              

    అద్భుతమైన పాట..చాలామందికి(ముఖ్యంగా అమ్మాయిలకి) జీవితాంతం ఇష్టమైన పాట......చిత్ర  గారికి కృతజ్ఞతలు....దేవి శ్రీ ప్రసాద్ కి  ధన్యవాదాలు...

               

 
                 
                 

Monday, 20 June 2011

nenu nenuga leney....




                                     దేవి శ్రీ ప్రసాద్  సినిమాల్లో అద్భుతమైన సంగీతం ఇచ్చిన సినిమాల్లో మన్మధుడు కూడా ఒకటి.......అందుల్లో అందరికి నచిన ఒక పాట......
                  చిత్రం: మన్మధుడు,  దర్శకుడు:విజయ భాస్కర్,  సంగీతం:దేవి శ్రీ ప్రసాద్, సాహిత్యం:సిరివెన్నెల సీతారామశాస్త్రి
 
 
పల్లవి:       నేను  నేనుగా  లేనే  నిన్న  మొన్నలా
                లేనిపోని   ఊహల్లో  ఏమిటో  ఇలా
                ఉన్న  పాటుగా  ఏదో  కొత్త  జన్మలా
                ఇప్పుడే  ఇక్కడే  పుట్టినట్టుగా ....||  నేను నేనుగా 2 ||


చరణం 1: పూలచెట్టు  ఊగినట్టు  పాలబొట్టు  చిందినట్టు
               అల్లుకుంది  నా  చుట్టూ  ఓ  చిరునవ్వు
               తేనెపట్టు  రేగినట్టు  వీణమెట్టు వులికినట్టు
               ఝల్లుమంది  గుండెల్లో  ఎవరే  నువ్వు
               నా  మనసుని  మైమరపున  ముంచిన  ఆ  వాన
               మీకేవరికి  కనిపించదు  ఏమైనా  ఓఓ ..హో ..హూ ...|| నేను నేనుగా ||

చరణం 2:  చుట్టు పక్కలెందరున్నా   గుర్తు  పట్టలేక  వున్నా
               అంత  మంది  ఒకలాగే  కనపడుతుంటే
               తప్పు  నాది  కాదు  అన్న  ఒప్పుకోరు  ఒక్కరైనా
               చెప్పలేను  నిజమేదో  నాకూ  వింతే
               కళ్ళను  వదిలేల్లను  అని  కమ్మిన  మెరుపేదో
               చెప్పవా కను  రెప్పలకే  మాటొస్తే  ఓఓ ...హో ...హూ ...! || నేను నేనుగా  ||

Sunday, 19 June 2011

malli....aakasha ganga....

                       మళ్లీ  వాన లో తడుద్దామని ఈ పాట పోస్ట్ చేస్తున్నా....... నిజానికి ఎన్నిసార్లు విన్నా ఈ పాట తనివి తీరదు....కార్తీక్ కి కమలాకర్ కి ఎన్నో ధన్యవాదాలు......


పల్లవి:     ఆకాశగంగా…దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …
              జల జల  జడిగా .. తొలి  అలజడిగా …
              తడబడు  అడుగా .. నిలబడు  సరిగా …
              నా తలపు  ముడివేస్తున్నా  నిన్నాపగా …
              ఆకాశగంగా … దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …  ||ఆకాశగంగా … ||
చరణం 1: కనుబొమ్మ  విల్లెత్తి I.. ఓ  నవ్వు  విసిరావే …
              చిలకమ్మ  గొంతెత్తి  తీయంగా  కసిరావే    ||2||
              చిటపటలాడి .. వెలసిన  వాన …
              మెరుపులా  దాడి .. కనుమరుగైనా …
              నా  గుండెలయలో .. విన్నా  నీ  అలికిడి …
              ఆకాశగంగా …దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …|| ఆకాశగంగా … ||
చరణం 2: ఈ  పూట  వినకున్నా .. నా  పాట  ఆగేనా …
              ఏ బాట  లోనైనా .. నీ  పైటనోదిలేనా … ||2||
              మనసుని  నీతో .. పంపిస్తున్నా …
              నీ  ప్రతి మలుపు  తెలుపవే  అన్నా …
              ఆ  జాడలన్నీ వెతికి .. నిన్ను  చేరనా  …
              ఆకాశగంగా …దూకావే  పెంకితనంగా …
              ఆకాశగంగా …
              జల  జల  జడిగా .. తొలి  అలజడిగా …
              తడబడు  అడుగా .. నిలబడు  సరిగా …
              నా  తలపు  ముడివేస్తున్నా  నిన్నాపగా …|| ఆకాశగంగా … ||

Monday, 6 June 2011

VAANA..

          ఈ పాట వింటున్నంత సేపు వాన లో తడిసి ముద్దవటం ఖాయం.....కమలాకర్ సంగీతానికి కార్తిక్ గానం తోడయ్యి  m .s .రాజు తెరకెక్కించిన ప్రకృతి అందాలలో ఈ పాట కి ఒక జీవం వచ్చింది...ఈ పాట నచని వాళ్లు చాల అరుదుగా ఉంటారు అనటం లో సందేహం లేదు......



పల్లవి:     ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో …
              ఎదను తడిపింది  నేడు చినుకంటి చిన్నదేమో …
              మైమరచిపోయా మాయలో …
              ప్రాణమంత మీటుతుంటే వాన  వీణలా … ||ప|| ఎదుట  నిలిచింది  చూడు …||

చరణం1:    నిజంలాంటి  ఈ  స్వప్నం .. ఎలాపట్టి  ఆపాలి …
                 కలే  అయితే  ఆ  నిజం  ఎలా  తట్టుకోవాలీ …
                 అవునో  కాదో  అడగకంది నా  మౌనం …
                 చెలివో  శిలవో  తెలియకుంది   నీ  రూపం …
                 చెలిమి  బంధమల్లుకుందే .. జన్మ  ఖైదులా …||ప||ఎదుట  నిలిచింది  చూడు …||

చరణం 2:    నిన్నే  చేరుకోలేక  ఎటేళ్లిందో..   నా  లేఖ …
                  వినేవారు  లేకా .. విసుక్కుంది  నా  కేక …             
                  నీదో  కాదో  రాసున్న  చిరునామా
                  వుందో  లేదో  ఆ  చోట  నా  ప్రేమా
                  వరంలాంటి  శాపమేదో  సొంతమైందిలా
                  ఎదుట  నిలిచింది  చూడు … ||ప||

Monday, 21 March 2011

criminal...

   క్రిమినల్ చిత్రంలో అద్భుతమైన పాట ....తెలుసా మనసా ...ఎన్ని తరాలైన అందరికీ నచ్చే పాట ఇది.

    చిత్రం:క్రిమినల్ , సాహిత్యం:సిరివెన్నెల ,సంగీతం:యం.యం.కీరవాణి. గానం:ఎస్.పి.బాలు,చిత్ర. 


 పల్లవి:      తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
                తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
                విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
                శతజన్మాల బంధాల బంగారు క్షణమిది          
          
                తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

చరణం 1: 
                  ప్రతి  క్షణం   నా  కళ్ళల్లో నిలిచే  నీ  రూపం
                  బ్రతుకులో  అడుగడుగునా నడిపే   నీ  స్నేహం
                  ఉపిరే  నీవుగా ప్రాణమే  నీదిగా
                  పది  కాలాలు  వుంటాను నీ  ప్రేమ  సాక్షిగా

                  తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 


                  darling every breath you take
                  every move you make
                  i will be there
                  what would i do without you
                  i want to love you
                  forever and ever and ever

చరణం 2 :   యెన్నడూ  తీరిపోని ఋణముగా  వుండిపో
                  చెలిమితో  తీగసాగే మల్లెగా  అల్లుకో
                  లోకమే  మారినా కాలమే  ఆగినా
                  మన  ఈ గాధ  మిగలాలి  తుదిలేని  చరితగా
         
                 తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
                 తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
                 విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
                 శతజన్మాల బంధాల బంగారు క్షణమిది         

                 తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో 
                 తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో.....


                     ఈ పాటలో   సాహిత్యం  యెంత బాగుంటుందో  పాట తీసిన విధానం కూడా అంతే అందంగా ఉంటుంది....ఇంత అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చిన సిరివెన్నెల గారికి దానికి ఇంకా అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చిన కీరవాణి గారికి  హేట్సాఫ్...........