సాహిత్యం:సిరివెన్నెల చిత్రం:యమలీల సంగీతం: ఎస్.వి.కృష్ణారెడ్డి గానం:కె.ఎస్.చిత్ర
పల్లవి: సిరులోలికించే చిన్ని నవ్వులే మణి మాణిక్యాలు
చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు
బుడిబుడి నడకలే తప్పటడుగులే తరగని మాన్యాలు
చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు
ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూనా
ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా
మహారాజులా జీవించాలి నిండునూరేళ్ళు || సిరులొలికించే ||
కోరస్ : జాబిల్లి జాబిల్లి జాబిల్ల్లి మంచి జాబిల్లి జాబిల్లి జాబిల్లి
చరణం 1: నాలో మురిపెమంతా పాలబువ్వై పంచనీ
లోలో ఆశలన్నీ నిజమయేలా పెంచనీ
మదిలో మచ్చ లేనీ చందమామే నువ్వనీ
ఊరూ వాడ నిన్నే మెచ్చుకుంటే చూడనీ
కలకాలమూ కనుపాపల్లె కాసుకోనీ
నీ నీడలో పసిపాపల్లే చేరుకోనీ ||సిరులొలికించే||
చరణం 2: వేశా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా
నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా
నాలో అణువుఅణువు ఆలయంగా మారగా
నిత్యం కొలుచుకోనా అమ్మ ఋణమే తీరగా
తోడుండగా నను దీవించే కన్నప్రేమ
కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా ||సిరులొలికించే చిన్నినవ్వులే --జీవించాలి నిండునూరేళ్ళు ||






